శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి : ఎస్పీ

BHPL: గత సంవత్సరంతో పోల్చితే జిల్లాలో క్రైం రేటు స్వల్పంగా పెరిగిందని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. నేరానికి తగ్గ శిక్షలు విధించడంలో పూర్తిగా సఫలీకృతమయ్యామని ఆయన పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 2024 వార్షిక క్రైం రిపోర్టును విడుదల చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ 27 వరకు 3,306 కేసులు నమోదయ్యాయన్నారు.