ప్రశాంతంగా జరిగిన టెన్త్ బయో సైన్స్ పరీక్ష
NLG: చిట్యాల పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలలో జరిగిన టెన్త్, బయోసైన్స్ పరీక్ష మంగళవారం సుజావుగా సాగింది. మొత్తం 417 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 416 మంది పరీక్ష వ్రాసినట్లు తెలిపారు. ఒకరు గైర్హాజరు కాగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా జరిగిందని ఎంఈఓ సైదా నాయక్ తెలిపారు.