పెరుగుతున్న వరద... భయాందోళనలో లంక ప్రజలు

కోనసీమ: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కోటిపల్లి వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. గత నెలలో వచ్చిన వరదలకు గోదావరిలో పడవ ప్రయాణం అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లంక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద పెరిగితే తమ పంటలు ముంపునకు గురవుతాయని ఆవేదన చెందుతున్నారు.