అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం
GDWL: సంగాల గ్రామంలో ఇటీవల గుడిసె దగ్ధమై సర్వం కోల్పోయిన అంజలమ్మ, కొండన్న కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. 'మానవసేవే మాధవసేవ' వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన రూ. 56,000 నగదును గురువారం ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ రాజశేఖర్, అయ్యప్ప రెడ్డి చేతులమీదుగా బాధితులకు అందజేశారు. కష్టకాలంలో స్పందించి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించిన గ్రామ పెద్దలను బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.