VIDEO: సాలూరలో గ్యాస్ కొరత లేదు: ఏజేన్సీ
NZB: సాలూర మండలంలో గ్యాస్ కొరత ఉందన్న వార్తలు అసత్యమని దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ సోమవారం స్పష్టం చేసింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అన్ని గ్రామాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని వినియోగదారులను కోరింది.