భయం భయం.. రహదారి అంచునే ట్రాన్స్‌ఫార్మర్
MBNR: నవాబ్‌పేట మండలం చౌడూర్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన విద్యుత్ నియంత్రిక ప్రమాదకరంగా మారింది. తక్కువ ఎత్తులో రక్షణ కంచె లేకుండా ఉండడంతో పశువులు, మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. రోడ్డు పక్కనే సమస్యలు కన్పిస్తున్న అధికారులెవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.