video: పాలకొల్లులో చిరుత పులి సంచారం
KRNL: ఓర్వకల్లు మండలం పాలకొల్లు గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం గ్రామంలో చిరుత పులి సంచారం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా సంచారం చేస్తుండడంతో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫారెస్ట్ అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.