'వసతి గృహాల్లో నాణ్యమైన బోధన అందించాలి'
SRD: వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే తొలగించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాలని, వారి ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.