కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో తహసీల్దార్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.