VIDEO: మంత్రి కొల్లు రవీంద్రపై మండిపడ్డ పేర్ని నాని
కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని గురువారం మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చిన పాపం మంత్రి కొల్లు రవీంద్రను వదిలి పెట్టదని అన్నారు. ఇళ్లను కూల్చి వారి గుండెల్లో దింపిన బాధను నీకు తెలిసేలా చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం, పదవులు అధికారం శాశ్వతం కాదని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.