జూబ్లీహిల్స్ బైపోల్.. TDP ఓట్లు ఎవరికి?
TG: జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో TDP సానుభూతి పరుల ఓట్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. NDA కూటమిలో TDP ఉండటంతో తమకే మద్దతు ఉంటుందని BJP ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు రేవంత్‌తో TDP సాన్నిహిత్యం కారణంగా తమకే ఓట్లు పడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పదేళ్ల పాలన, అభివృద్ధి కారణంగా TDP ఓటర్లు తమ పార్టీకే పట్టం కడతారని BRS ఆశాభావం వ్యక్తం చేస్తోంది.