గణేష్ ఉత్సవాలను ప్రశాంతగా జరపాలి: CP

JN: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై శనివారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాలు భక్తి భావంతో శాంతియుతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తదితరులున్నారు.