క్రికెట్ ఆడిన జిల్లా ఎస్పీ

క్రికెట్ ఆడిన జిల్లా ఎస్పీ

W.G: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి క్రీడా పోటీలు బుధవారం భీమవరం DNR కళాశాల క్రికెట్ మైదానంలో జరిగాయి. ఈ పోటీల్లో పోలీస్ క్రికెట్ లీగ్ ఫైనల్‌లో ఎస్పీ ఎలెవన్ టీమ్ విజయం సాధించింది. టోర్నమెంట్‌లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల ప్రతినిధులతో ఏర్పడిన జట్లు పరస్పర క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొన్నారు.