రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన హాలిడే కార్నివాల్
HYD: రామోజీ ఫిల్మ్ సిటీలో హాలిడే కార్నివాల్ గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీ వరకు 46 రోజుల పాటు పర్యాటకులను అలరించనుంది. సినీ ప్రపంచంలో వినోదం, విహారం కలగలిసిన రామోజీ ఫిల్మ్ సిటీ హాలిడే కార్నివాల్ తొలి రోజు నుంచే పర్యాటకుల మదిని దోచేస్తోంది. ఎన్నో ప్రత్యేక ఆకర్షణలతో ఈ హాలిడే కార్నివాల్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.