VIDEO: వర్షాలకు దెబ్బతిన్న వరి.. దిగుబడిపై రైతుల ఆందోళన
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నేలకొరిగిన వరి పొలాలను కోయడానికి యంత్రాలకు ఎక్కువ సమయం (2-3 గంటలు) పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటు యంత్రాల కొరత కూడా ఉందని వాపోతున్నారు. వర్షాల దెబ్బకి పంటంతా నేలపై వాలిపోవడంతో దిగుబడులు తగ్గుతాయి ఎమో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.