పోక్సో కేసులో నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష

ASF: పోక్సో కేసులో నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష రూ. 50వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్ తీర్పునిచ్చినట్లు లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపారు. వంజరిగూడకు చెందిన చంద్రకాంత్ మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు రుజువు కావడంతో నిందితుడికి జడ్జి శిక్ష విధించారు.