సారపాకలో వెల్లివిరిసిన మత సామరస్యం
BDK: బూర్గంపహాడ్ మండలం సారపాకలో శ్రీరామనవమి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం ఎంపవర్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ కార్యక్రమంలో పాల్గొని వారి సేవలను అభినందించారు. హిందూ పండుగలో ముస్లింల సేవా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.