వింత ఆచారం.. చెప్పులతో కొట్టుకుంటూ హోలీ

వింత ఆచారం.. చెప్పులతో కొట్టుకుంటూ హోలీ

UPలోని మథుర జిల్లా బచ్చగావ్‌లో 'చెప్పుల హోలీ' అనే వింతైన ఆచారం కొనసాగుతోంది. గ్రామస్తులు రంగులు చల్లుకుంటూనే, ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామంలోని దుష్టశక్తులు నశించి, సుఖశాంతులు కలగాలనే నమ్మకంతో దశాబ్దాలుగా ఈ వింత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.