వినాయక ఊరేగింపులో బాణసంచా పేలి వ్యక్తి మృతి

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకలకుంట పంచాయతీ బాగాదీపల్లెలో వినాయక స్వామి ఊరేగింపు సందర్భంగా బాణసంచా పేలి గాయపడిన నలుగురిలో పాలకొండయ్య (35) శుక్రవారం మృతి చెందారు. గత నెల 29న జరిగిన ఈ ఘటనలో గాయపడిన పాలకొండయ్య కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.