VIDEO: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్
NRML: ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల జడ్పి పాఠశాలలో ఆస్ట్రోనామీ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేతో కలిసి ఆస్ట్రోనామీ ల్యాబ్‌ను, రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.