'ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'

'ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'

KMR: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి , రాజంపేట మండలాల్లో పోలింగ్ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. చిన్న మల్లారెడ్డి, రాజంపేట పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అక్కడ విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.