J&Kలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్ర సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పోషియన్, బారాముల్లా ప్రాంతాల్లో నిన్న గాలింపు చర్యలు కొనసాగాయి. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అయినప్పటికీ, ఇంకా ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చనే అనుమానంతో ఈ ఆపరేషన్‌ను మరింత తీవ్రతరం చేశారు.