'రేషన్ పంపిణీలో కేంద్రం కీలక నిర్ణయం'
SKLM: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని బీజేపీ జిల్లా నాయకులు చింతాడ శ్రీనివాస్ బుధవారం అన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి ఒకేసారి మొత్తం 18 కేజీలు ఇస్తారన్నారు.