ఈవీఎంలు గోదాము పరిశీలించిన కలెక్టర్

ఈవీఎంలు గోదాము పరిశీలించిన కలెక్టర్

WNP: జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డివో కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం గోదామును నెలవారీ తనిఖీలో భాగంగా ఆర్డివో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రత ఏర్పాట్లను తనిఖీ చేశారు.