కాలం చెల్లిన కలాకండ్ తిని పిల్లలకు అస్వస్థత
ASF: పాడైన కలాకండ్ తిని ఓ చిన్నారి అస్వస్థతకు గురైన ఘటన ఆసిఫాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి పట్టణంలోని మహాలక్ష్మి స్వీట్ హౌస్‌లో కలకండ్‌ను కోనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. కలాకండ్ తిన్న పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో స్వీట్ హౌస్ యాజమానిని నిలదీయగా కాలం చెల్లిన కలాకండ్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో స్వీట్ హౌస్ నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.