అంగన్వాడీ టీచర్ మాధవికి కేంద్ర స్థాయి గౌరవం
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ మాధవి తన సేవలకు కేంద్ర స్థాయి గౌరవం పొందింది. రేపు జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిల్లీలో అశోక్ భవన్‌లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి, సహాయక మంత్రి సావిత్రి ఠాగూర్ చేతుల మీదుగా ఆమెకు ప్రశంసాపత్రం అందుకోనున్నట్లు అధికారులు నేడు ఓ ప్రకటనలో తెలిపారు.