బాత్రూమ్‌లో మహిళ సూసైడ్.. కేసు నమోదు

బాత్రూమ్‌లో మహిళ సూసైడ్.. కేసు నమోదు

W.G: నరసాపురం ఏరియా ఆసుపత్రిలో మహిళ మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జయలక్ష్మి తెలిపారు. పీఎం లంక గ్రామానికి చెందిన సంకరపు అరుంధతి (38) ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతుందన్నారు. మంగళవారం బాత్రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ కే.ప్రశాంతి ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.