ఆలయ సమీపంలోనే చెత్త కుప్పలు
PPM: పాలకొండ పట్టణంలోని ఎన్‌కే.రాజపురం రామాలయం సమీపంలోని ప్రధాన రహదారి చెత్తతో నిండిపోయి దుస్థితికి చేరుకుంది. రోజుల తరబడి వ్యర్థాలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.