చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కమిషనర్ మౌర్య
తిరుపతి నగరంలో చెత్త నిర్వహణను వందశాతం పక్కాగా చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తూకివాకం వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించి తడి, పొడి చెత్త వేరు చేసి సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మార్కెట్, హోటల్ వ్యర్థాల వివరాలను రోజువారీగా నమోదు చేయాలని చెప్పారు. భవన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.