VIDEO: మద్యం మత్తులో యువతి వీరంగం
HYD: బంజారాహిల్స్‌లోని స్టడీ సర్కిల్ వద్ద నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించి, పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఆమె వాహనాన్ని సీజ్ చేసి, బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. నిబంధనల ఉల్లంఘన, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.