అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
నల్గొండ పట్టణంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పానగల్ నుంచి డిఈవో ఆఫీస్ వరకు 15 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, ఈ ప్రాంతాన్ని అంబేద్కర్ సర్కిల్‌గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.