వర్షాలకు తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలి

వర్షాలకు తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలి

NRPT: అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు భారతీయ కిసాన్ సంఘ్ నేతలు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ.. తడిసిన వరి ధాన్యం కొనుగోలుకు నిబంధనల పేరిట రైతులకు ఇబ్బందులు పెట్టకుండా ఖరీదు చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.