రేపు విజయవాడకు ప్రముఖ సిని నటి

విజయవాడకు రేపు ప్రముఖ సినీనటి రానున్నారు. శుక్రవారం విజయవాడలోని ఏలూరు రోడ్డు బీసెంట్ రోడ్డు ప్రాంతంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీనటి కీర్తి సురేశ్ హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటకు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కీర్తి సురేశ్ చేతుల మీదుగా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.