అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

CTR: కొండారెడ్డిపల్లిలోని తన కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శుక్రవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. మొత్తంగా 54 అర్జీలు వచ్చాయి. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సంబంధిత అధికారులకు బదలాయించి పరిష్కరించాలని ఆదేశించారు.