చెరువుగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల సహకారంతో చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కు ఏర్పాట్లు చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నార్కట్‌పల్లి నుండి మాండ్ర వరకు రూ. 14 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే, ఎంపీ చామలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు.