పొన్నూరులో డ్వాక్రా మహిళలతో ఎమ్మెల్యే

పొన్నూరులో డ్వాక్రా మహిళలతో ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు మండలంలోని పచ్చలతాడిపర్రులో ఆదివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశమయ్యారు. డ్వాక్రా రుణాల వినియోగం, గత ప్రభుత్వంలో జరిగిన నిధుల అవకతవకలపై ఆయన చర్చించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలుపై మహిళల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.