రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

VZM: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నెల్లిమర్లలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక మిమ్స్ ఆసుపత్రి సమీపంలో గల పాత రైల్వే గేట్ దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈమేరకు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.