VIDEO: VRA సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద నిరసన
KDP: AP గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కడప కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించాలని, పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన VRAలకు VROగా ప్రమోషన్‌లు ఇవ్వాలని, కనీస వేతనాన్ని రూ. 26,000కి పెంచాలని, వాచ్మెన్, అటెండర్, జీపు డ్రైవర్లకు అర్హత ప్రకారం ప్రమోషన్‌లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.