రాంగ్ రూట్‌లో డ్రైవింగ్.. నిర్లక్ష్యం ఎందుకు..?
HYD: నగరంలో వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నా ట్రాఫిక్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. గచ్చిబౌలిలోని AMB ప్లైఓవర్‌పై మధ్యలో బారికేడ్లు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా రాంగ్ రూట్‌లో వాహనాలను నడుపుతున్నారు. బైకర్లు ఇంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ట్రాఫిక్ సిబ్బంది చోద్యం చూస్తుండడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.