పోలింగ్ కేంద్రం సందర్శించిన కలెక్టర్
MDK: హవేలీ ఘనాపూర్ మండలం తొగుట పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని, ఇప్పటివరకు 56% పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వివరించారు. 100% పోలింగ్ జరిగేందుకు ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖను ఆదేశించినట్లు తెలిపారు