రూ.30 లక్షల లాటరీ.. విజేత కోసం గాలింపు
రూ.50కి లాటరీ టికెట్ కొని రూ.30 లక్షలు గెలుచుకున్నవ్యక్తి కోసం నిర్వాహకులు గాలింపు చేపట్టారు. పంజాబ్‌లో లాటరీ నిర్వహించే ఓ సంస్థ.. FEB 26న విజేతలను ప్రకటించగా ఇందులో ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. కానీ అతడి అడ్రస్ లేకపోవడంతో గాలింపు చేపట్టారు. విజేతను ప్రకటించిన తర్వాత నెల రోజుల్లోపు ప్రైజ్ మనీ తీసుకోకపోతే అది ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని సదరు సంస్థ వెల్లడించింది.