నేడు జన్నారంలో ఎమ్మెల్యే పర్యటన

MNCL: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ శుక్రవారం జన్నారంలో పర్యటించనున్నారు. ఉ.11 గం.లకు మండలంలోని రైతువేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే రైతు వేదికలో ఎంపికైన గౌడన్నలకు కిట్స్ పంపిణీ చేస్తారు. మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొంటారు.