ముత్యాలమ్మ గుడికి శంకుస్థాపన

ముత్యాలమ్మ గుడికి శంకుస్థాపన

BDK: జూలూరుపాడు మండలంలో వీరభద్రపురం గ్రామంలో ఆదివాసీ గూడెంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు ముత్యాలమ్మ గుడికి సోమవారం కాంగ్రెస్ నాయకుడు దుద్దుకూరి సుమంత్ శంకుస్థాపన చేశారు. అమ్మ వారి అనుగ్రహం గ్రామంపై, గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం గ్రామానికి ఒక శుభ పరిణామం అని, గ్రామస్థులు అందరు కలికట్టుగా ఉండి గుడి నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు.