VIDEO: ఐషర్ వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం
KDP: ముద్దనూరు మండలం యామవరం సమీపంలో NH-67పై కడప నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న ఐషర్ వాహనం రోడ్డు పక్కన ఉన్న కంప చెట్లలో మంగళవారం బోల్తా పడింది. స్థానికుల సమాచారం ప్రకారం.. వాహనంలో పంట పొలాలకు వాడే పురుగుల మందులను లోడ్ చేసి ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.