ఎనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. యుద్ధ ప్రభావం వల్ల ధరలు పడిపోవడం సిండకేట్, చోరి కేసుల కారణంగా కోనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ యార్డు ప్రధాన కార్యాలయం వద్ద రైతులు నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నారు.