ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి: సీపీఎం

ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి: సీపీఎం

KMM: ఎర్రుపాలెం మండల కేంద్రం నుంచి రేమిడిచర్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని శుక్రవారం ఎర్రుపాలెం మండల సీపీఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎర్రుపాలెం, రేమిడిచర్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.