ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని నిరసన

RR: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షాద్‌నగర్ పట్టణంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతుందన్నారు.