సభలు, సమావేశాలు నిర్వహించకుండా సీఎం ఆంక్షలు
WNP: గొల్లపల్లి వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చి, మళ్లీ రద్దు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఆయన నివాసంలో మాట్లాడుతూ.. విపక్షాలు, ప్రజా సంఘాలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా సీఎం ఆంక్షలు విధిస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.