గచ్చిబౌలి స్టేడియంలో రెండు కొత్త అకాడమీలు

RR: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో హాకీ, అథ్లెటిక్స్ అకాడమీలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా వసతులు అందుబాటులో ఉన్నాయి. హాకీకి 48 మంది, అథ్లెటిక్స్ కోసం 30 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో మూడేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.