బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు: MLA
NZB: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి తెలిపారు. గురువారం నగర శివారులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నాన్ షెడ్యూల్ 126 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వాటిలోని 64 జనరల్ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు.